ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూడడంతో గాయంకారణంగా జట్టుకు దూరమైన ధోని ఎప్పుడు తిరిగి వస్తాడో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సిఎస్కే ఈ సీజన్‌ను చాలా నిరాశాజనకంగా ప్రారంభించింది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది.
మూడు మ్యాచ్‌లలోనూ జట్టు ప్రదర్శన తక్కువ స్థాయిలో ఉండటంతో, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోని లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కాల్‌ఫ్ గాయంతో ధోని ఐపీఎల్ మొదటి రెండు వారాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో ధోని మొదటి రెండు వారాలు మిస్ అవుతాడని తెలిపారు. అందువల్ల ఏప్రిల్ 11న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు కూడా అతను దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఆ మ్యాచ్ తర్వాత ధోని జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ..మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది హై స్కోరింగ్ గ్రౌండ్. పిచ్ బాగుంది, రన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వాళ్లను సాధ్యమైనంత వరకు నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. ఎంఎస్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు; కొన్నిసార్లు సమయం పడుతుంది. అతను ఆడేందుకు సిద్ధంగా ఉంటే త్వరలోనే తిరిగి వస్తాడు. మొదటి మ్యాచ్ నిరాశ కలిగించింది కానీ రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ మెరుగైంది. జట్టు మొత్తం నమ్మకంగా ఉంది. అదే జట్టుతో ఆడతాం అని తెలిపారు.
Also Read:అరుణాచల్ సీఎంపై సీబీఐ దర్యాప్తు

