ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ రోజు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోకి కరోనా విజృంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం పీఎంవో ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మోదీ అన్నారు. కరోనా పరీక్షలను మరింత పెంచాలన్నారు. కరోనా ప్రీకాషన్ డోసులను ప్రోత్సహించాలని చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలన్నారు.
దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో బెడులు, ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఔషధాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 150మాత్రమే నమోదువుతున్నాయని అన్నారు. ఒక వేళ విజృంభిస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల వైద్య పరికరాలు వైద్య సిబ్బందిని సమకూర్చుకునేందుకు సిద్దంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇవి కూడా చదవండి…