మోడీ పాలనలో.. దేశం నాశనం !

29
- Advertisement -

2014 లో భారత ప్రధానిగా అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు తనదైన రీతిలో పాలన సాగిస్తున్నారు. 2014 లో మోడీని నమ్మిన దేశ ప్రజలు 2019లోను తిరిగి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఈ ఎనిమిదేళ్ళలో మోడీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యవసర ధరల పెంపు, జి‌ఎస్‌టి అదనపు పన్నుల భారం.. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సర్కార్ ప్రజలపై వేస్తున్న ఆర్థిక భారం అంతా ఇంత కాదు. దీంతో మోడీ పాలనపై సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా ఏర్పడుతూ వస్తోంది. అయితే ఈ ఎనిమిదేళ్ళలో మోడీ పాలనలో దేశం నాశనం అవుతోందంటూ ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. .

ఎప్పుడు కూడా మోడీ పాలనలో వైఫల్యాలను ఫ్రూప్స్ తో సహ బయటపెట్టే ఆయన ఈసారి కూడా మోడీ పాలనలో దేశం ఎంత దిగజారిపోయిందో తెలిపే ఓ పోటో ను షేర్ చేశారు. అందులో 2014 కంటే ముందు దేశం ఏ పొజిషన్ లో ఉంది.. 2014 తరువాత ఎలా దిగజారిపోయింది అనే తెలిపే సూచికలు ఆ ఫోటోలో ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ ఇండెక్స్ లో మన దేశం 2014 కంటే ముందు 85 వ స్థానంలో ఉంటే మోడీ పాలనలో 2022 నాటికి 146 వ స్థానానికి పడిపోయింది. ఇక ఆకలి సూచికలో 2014 కంటే ముందు 55వ స్థానంలో ఉండగా 2022 నాటికి 107 పడిపోయింది. పర్యావరణ సంరక్షణ సూచీ లో 2014 కంటే ముందు 155 వ స్థానంలో ఉండగా 2022 నాటికి 180 కి చేరింది. ఇలా దాదాపు 10-11 సూచికల్లో భారత్ చాలా దిగజారిపోయింది అని తెలిపే విధంగా ప్రశాంత్ భూషణ్ షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ స్థానం పడిపోతుముంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ యొక్క సూచికల విషయంలో మోడీ సర్కార్ నుంచి ఎవరెల స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఘర్ వాపసే..సొంత గూటికి ఈటల?

జగన్ పరిపాలనపై..ప్రజా డెసిషన్?

ముగిసిన శాసనసభ సమావేశాలు

- Advertisement -