వామ్మో.. మోడీ సర్కార్ ఇన్ని అప్పులా ?

89
- Advertisement -

గుజరాత్ మోడల్ అంటూ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ జపం చేస్తూ అధికరంలోకి వచ్చింది బీజేపీ. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ సర్కార్ పై అనుకూలత ఏ స్థాయిలో ఉందో ప్రతికూలత కూడా అంతే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. విదేశాల్లో ములుగుతున్న నల్లదనాన్ని వెనక్కి తీసుకొస్తామని పెద్ద నోట్ల రద్దు చేసిన మోడీ సర్కార్, నల్లదనాన్ని ఎంతవరకు దేశానికి తిరిగి తీసుకొచ్చిందో తెలియదు గాని, ప్రజలను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.ఇక మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కూడా మూట గట్టుకుంది మోడీ సర్కార్ అయినప్పటికి, వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2019 ఎన్నికల్లో కూడా మోడీ పాలనకే పట్టం కట్టారు దేశ ప్రజలు. .

కాగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8ఏళ్ళకు పైగానే అయింది. అయితే ఈ ఎనిమిదేళ్ళలో దేశం ఏమైనా పురోగతి సాధించిందా ? సమాధానం చెప్పలేని పరిస్థితి… ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో మనదేశం అయిదవ స్థానానికి చేరుకున్నాప్పటికి, అప్పులు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ ఎనిమిదేళ్ళలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 12,61,929 కోట్ల విదేశీ రుణభారం మనదేశంపై ఉందట. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్ దరఖాస్తుపై కేంద్రం అంధించిన వివరాలు అవి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేంద్రంపై రుణభారం ఏ స్థాయిలో ఉందనే విషయం.

కాగా 2014 కంటే ముందు విదేశీ రుణభారం రూ.4,32,950 కోట్లలో ఉండేది. కానీ ఇప్పుడు. రూ.12,61,929 కోట్లకు చేరింది. అంటే 2014 కంటే ముందుతో పోలిస్తే.. రూ.8,28,979 కోట్లు అదనం. వీటిలో కేంద్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు 7.12 లక్షల కోట్లు ఉండగా.. వివిద ప్రభుత్వ రంగా సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు 88,947 కోట్లు గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి సుమారు లక్ష కోట్ల రూపాయలు విదేశాల నుంచి రుణాలను సేకరించింది. దాంతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశంలో విదేశీ రుణభారం 80 శాతానికి పెరిగింది. అంటే మనదేశ జనాభ పరంగా చూస్తే సుమారు 140 కోట్లు కాగా.. ఒక్కొక్కరిపై 5 లక్షలకు పైగా రుణభారం ఉందని అర్థం. మొత్తానికి మోడీ పాలనలో మనదేశం అప్పుల దిబ్బగా మారిందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -