ఏపీలో బీజేపీ.. కష్టమే ?

66
- Advertisement -

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోడి అమిత్ షా నాయకత్వలో దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోనూ బలంగా విస్తరించాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టి అధికారం చేజిక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నార్త్ లో బీజేపీ బలం ఎలా ఉన్న సౌత్ లో మాత్రం కాషాయపార్టీ గడ్డు కాలమనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎప్పటినుంచో పాగా వేయాలని భావిస్తున్నప్పటికి ఇక్కడి ప్రజలు కాషాయ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికి బీజేపీ మాత్రం ఈ రాష్ట్రాలలో బలం చాటుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో కాషాయ పార్టీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. .

అసలు ఏపీలో బీజేపీ ఉందనే విషయాన్ని ప్రజలు చాలా లైట్ తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి, మోడి చరిష్మా కు ఏపీలో కూడా అభిమాన ఘనం ఉన్నప్పటికి, ప్రజలు మాత్రం కాషాయపార్టీని నమ్మడం లేదు. అందుకే ఏపీలో స్వబలం కన్నా మిత్రపక్షమైన జనసేన బలన్నే అధికంగా నమ్ముకుంది బీజేపీ. కాగా వచ్చే ఎన్నికల్లోనైనా ఏపీలో ఎంతో కొంత ప్రభావం ప్రభావం చూపాలని భావిస్తున్న కాషాయ పార్టీకి, సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు అదే పార్టీ నేత కన్నా లక్ష్మి నారాయణ మద్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో సక్యతగా ఉండడంలో ఏపీ బీజేపీ అద్యక్షుడు వెనుకబడ్డారని, అందుకే జనసేన బీజేపీ నుంచి దూరం అయ్యేందుకు సిద్దం అవుతుందని ఆ మద్య కన్నా లక్ష్మినారాయణ ఆ మద్య జరిగిన విశాఖా ఘటన తరువాత హాట్ కామెంట్స్ చేశారు.

కన్నా చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలను ఉలిక్కిపడేలా చేసిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి కన్నా లక్ష్మినారాయణ పార్టీ వ్యవహారాలపై ఆచితూచి స్పందిస్తున్నారు. అయితే అయన పార్టీ విడబోతున్నారనే ఈ మద్య బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కన్నా లక్ష్మినారాయణ స్పెషల్ గా నాదెండ్ల మనోహర్ తో బేటీ అయ్యారు. దీంతో కన్నా జనసేనలోకి చేరుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను జనసేన ఖండిస్తున్నప్పటికి, ఎంతో కొంత నిజం ఉందనే భావనా అందరిలోనూ ఉంది. ఎందుకంటే కన్నా లక్ష్మినారాయణ ఈ మద్య కాలంలో పవన్ పై అభిమానం కురిపిస్తున్నారు. ఇక కన్నా దారిలోనే మరికొంత మంది ఏపీ బీజేపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారట. దీంతో ఏపీలో జనసేన అండతోనే ఎడగాలని చూస్తున్న బీజేపీకి అదే పార్టీతోనే ముప్పు పొంచి ఉండడంతో.. ఇక ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -