పచ్చి కొబ్బరి తినడం మంచిదేనా?

30
- Advertisement -

పచ్చి కొబ్బెరిని మనం రకరకాలుగా ఉపయోగిస్తుంటాము. స్వీట్స్ తయారీలోనూ, వంటింట్లో వివిధ వంటకల్లోనూ పచ్చి కొబ్బరి వాడుతుంటాము. కొందరైతే పచ్చి కొబ్బరిని నేరుగా కూడా తింటూ ఉంటారు. మరికొంత మంది పచ్చి కొబ్బరిని మిక్స్ చేసుకొని ఫ్రూట్ సలాడ్ లలో వేసుకొని సేవిస్తుంటారు. అయితే ఇలా పచ్చి కొబ్బరి తినడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం ! పచ్చికొబ్బరిలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి దీనిని తినడం మంచిదే అని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనిని తినడం తింటే శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గిపోతాయట. పచ్చికొబ్బరిలో విటమిన్ ఏ, ఇ, సి వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో కాల్షియం, ఫైబర్, జింక్ వంటి మూలకాలు కూడా అధికంగానే ఉంటాయి..

పచ్చి కొబ్బరిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. పచ్చికొబ్బరిలో బెల్లం కలుపుకుని తింటే ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి కొబ్బరి మరియు బెల్లం కలిపి తింటే తక్షణ శక్తి లభిస్తుందట. అయితే పచ్చికొబ్బరి వల్ల లాభలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని అధికంగా తింటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు పచ్చికొబ్బరిని మితంగా తీసుకుంటే మంచిదే గాని ఎక్కువగా తింటే పిండంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందట. కాబట్టి పచ్చి కొబ్బరిని మితంగా తింటే తింటే ఆరోగ్యం అమితంగా తింటే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:క‌డియంను రాళ్ల‌తో కొట్టాలా?:మందకృష్ణ

- Advertisement -