MODI:మోడీ ఫేక్ డిగ్రీ.. నిజమేనా ?

36
- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోడీది ఫేక్ డిగ్రీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టారని, ఇది నిజం అని తేలితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మోడీ పై అనర్హత వేటు తథ్యం అని, అంతే కాకుండా ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అవుతుందని, భవిష్యత్ లో ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేరని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రధాని మోడీది ఫేక్ డిగ్రీ అని కొన్ని ఆధారాలు కూడా చూపించారు.

గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంటైర్ పోలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ లతో ఎంఏ పూర్తి చేసినట్లు ఉన్న మోడీ డిగ్రీ సర్టిఫికేట్ లో యూనివర్సిటీ ఉండాల్సిన ప్లేస్ లో యూనివర్సిటీ అని స్పెల్లింగ్ మిస్టేక్ గా ఉందని, అంతే కాకుండా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని పేర్కొన్న ఫాంట్ 1992 లో ఉనికిలోకి వచ్చిందని మరి ఆ ఫాంట్ 1983 నాటి సర్టిఫికేట్ లో ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఆప్ నేతలు.ఇక నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు చాలా సందర్భాల్లో పదవ తరగతి తరువాత విద్యాను కొనసాగించలేదని చెప్పిన వ్యాఖ్యలను ఆప్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక నకిలీ సర్టిఫికేట్ తో నరేంద్ర మోడీ, ఎమ్మెల్యే, డిప్యూటీ సి‌ఎం, సి‌ఎం, ఎంపీ, ప్రధాని వంటి అత్యున్నత పదవులను చేపట్టారని, మోడీ పై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరి ప్రధాని మోడీ ఫేక్ డిగ్రీకి సంబంధించి జరుగుతున్నా ఈ ఆసక్తికరమైన చర్చలో నిజంగానే మోడీకి అనర్హత వేటు తప్పదా ? అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రజాప్రతినిధుల చట్టం 1950- సెక్షన్ 8 ప్రకారం క్లాజులు నేరాలు నిరూపితం అయితే రెండేళ్ళు జైలు శిక్ష మరియు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇక ఇదే చట్టంలోని సెక్షన్ 125 ( ఏ ) ప్రకారం అఫిడివిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లైతే.. ఆర్నెల్లు జైలు శిక్ష మరియు జరిమానా లేదా రెండు కూడా విధించే అవకాశం ఉంది. కానీ సభ్యత్వ రద్దుపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. అయితే తప్పుడు అఫిడివేట్ కు శిక్షలు రూపొందించాలని ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు చాలా సార్లు పార్లమెంట్ ను కోరిన ఇప్పటివరకు ఆదిశగా అడుగులు పడలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీది ఫేక్ డిగ్రీ అని నిరూపితం అయిన ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి…

SSC Exams:విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్

KTR:తెలంగాణలో కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్..!

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..

- Advertisement -