జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ..వీడియో వైరల్

198
Modi does not support Gst
- Advertisement -

నేటి నుంచి అమల్లో తీసుకురానున్న జిఎస్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తన ప్రచార జోరును పెంచింది. గతంతో కాంగ్రెస్ హయాంలో జిఎస్ టిని తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఎలా జీఎస్టీని తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తోంది. నరేంద్ర మోడీ జిఎస్టీని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోలను కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.

జీఎస్టీ అమల్లోకి వస్తే గుజరాత్‌ చాలా నష్టపోతుందని, అందువల్ల తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని గుజరాత్‌ సీఎంగా మోడీ ఉన్నపుడు తెలిపారు. బలవంతంగా రాష్ట్రాలపై బిల్లును రుద్దాలని చూడొద్దని హితువు పలికారు. అప్పటి గుజరాత్‌ కేబినెట్‌ మంత్రి సౌరభ్‌ పటేల్‌.. జీఎస్టీ అమలైతే గుజరాత్‌ రూ.14 వేల కోట్లు నష్టపోతుందని చెప్పారు. అయితే మోడీ ప్రధాని అయ్యాక ఆయనే స్వయంగా జీఎస్టీకి మద్దతివ్వటం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -