మోడీ డైవర్షన్ పాలిటిక్స్.. !

18
- Advertisement -

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో మార్లు ధరలను పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూనే ఉంది మోడీ సర్కార్. ఇందన ధరల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒకప్పుడు రూ.50-70 రూపాయల మద్యలో ఉండే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు 100 రూపాయలు దాటి ఇంక పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక కాకుండా సామాన్యుడికి ఆ అవసరం అయ్యే ప్రతి వస్తువుపై కూడా ధరల భారం మోపింది మోడీ సర్కార్. మరి ఈ స్థాయిలో సామాన్యుడిపై ఆర్థికభారం మోపుతున్న మోడీ సర్కార్ ను ప్రశ్నించే హక్కు లేదా ? అంటే మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే.. తమను ప్రశ్నించే అధికారం ఎవరికి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రశ్నిస్తున్నా ప్రతిపక్షలాపై ఈడీ దాడులు, సిబిఐ సోదాలు నిర్వహిస్తు.. ప్రతిపక్షాల గొంతు నోక్కే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇదంతా కూడా మోడీ సర్కార్ వ్యూహంలోని భాగమే అని కొందరి వాదన.. వచ్చే ఎన్నికల్లో కూడా విజయంపై కన్నేసిన మోడీ.. తన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియకుండా పక్కా ప్లానింగ్ తోనే డైవర్షన్ పాలిటిక్స్ కు తీసినట్లు చెబుతున్నారు. మోడీ పాలనపై ఎండగట్టే ప్రయత్నం చేసే ప్రతి నేతపైన ఈడీ కేసులను నిర్వహిస్తోంది మోడీ సర్కార్. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీపై డాక్యుమెంటరీ తీసిన బీబీసి చానల్ పై ఈడీ సోదాలు నిర్వహించి.. గుజరాత్ అల్లర్లను మరచి పోయేలా చేసింది. ఇక ఇటీవల గ్యాస్ ధరల పెంపుతో మరోసారి మోడీ సర్కార్ పై గళం విప్పుతున్నా ప్రతిపక్షలను ఏకంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తూ జైలుకు పంపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ నుంచి బి‌ఆర్‌ఎస్ ద్వారా బీజేపీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉండడంతో బి‌ఆర్‌ఎస్ నేతలపై ఈడీ దాడులను ప్రేరేపిస్తోంది.

తాజాగా డిల్లీలో ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద దాదాపు 5 వేల మందితో బి‌ఆర్‌ఎస్ నేతలు దీక్షా చేపడుతున్న నేపథ్యంలో 9న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం వంటివి చూస్తే.. మోడీ సర్కార్ ఏ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందో ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటివరకు ఈడీ రైడ్ లలో విపక్ష నేతలపై 5,422 కేసులు నమోదు కాగా వాటిలో 22 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని మంత్రి కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు. ఇన్ని బట్టి చూస్తే విపక్షలపై మోడీ సర్కార్ ఏ స్థాయిలో కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో అర్థం అర్థమౌతోంది. మొత్తానికి మోడీ సర్కార్ ను ప్రశ్నించిన వారిపై కేసులు నిర్వహిస్తు.. వాస్తవాలు ప్రజలు తెలుసుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మోడీ సర్కార్ పై ప్రజలు తిరగబడే రోజులు తొందరలోనే ఉన్నాయనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి…

విచారణను ఎదర్కొంటా..కవిత

కాంగ్రెస్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్లు

- Advertisement -