అసత్యాలు మాట్లాడమే బీజేపీ సంస్కృతి: పల్లా

205
MLC Palla Rajeshwar Reddy
- Advertisement -

బీజేపీకి అసభ్యాలు, అసత్యాలు, అశ్లీలంగా మాట్లాడటం సంస్కృతి అయ్యింది అని అన్నారు ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం డోర్నకల్ నియోజకవర్గంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్, పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్మెన్ అంగోత్ బిందులతో కలిసి పాల్గొన్నారు

ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు గోబెల్స్‌లో యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా తీస్కున్నవాళ్ళలాగా మాట్లాడ్తున్నరు.. ఇవ్వాళ బీజేపీకి అసభ్యాలు, అసత్యాలు, అశ్లీలంగా మాట్లాడటం సంస్కృతి అయ్యింది అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన పొలాలకి నీళ్లు ఒచ్చినయ లేదా మీకు తెలుసు…కాలువలు బాగు చేసుకున్నాం, చెరువులు బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసుకున్నాం అని అన్నారు. డోర్నకల్ చివరి ఎకరానికి కూడా నీళ్లిచ్చింది ఇవ్వాళ కేసీఆర్ మాహాత్ముడే అని పల్లా తెలిపారు. కృష్ణ, గోదావరిలో మన వాటా లెక్కలు కట్టి కోటి ఎకరాలకి నీళ్లు తీసుకొస్తుంది ఇవ్వాళ కేసీఆర్ అని తెలిపారు.

తలసరి సగటు ఆదాయంలో 2014 కంటే డబుల్ అయినం, కేంద్రం కంటే డబుల్ అయినం… ఆర్ధిక వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఉన్నం..తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాలు బ్రతుకుతున్నయి అని అన్నారు. అప్పులు ఇష్టమొచ్చినట్లు చేయొచ్చా? రాష్ట్రం అప్పు ఎంత చేయాలి అనేది కూడా కేంద్రమే నిర్ణయిస్తది, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అనేవి ఉంటయి.. అప్పుల్లో కింది నుండి నాలుగో స్థానంలో ఉన్నం. వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసినం..10 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నం. రైతన్న ఆత్మహత్యల్లో 2014 వరకు ప్రధమ స్థానంలో ఉన్నం… వాళ్లకు కావాల్సిన సాగునీళ్లు, 24 గంటల కరెంటు, పెట్టుబడి ఇచ్చినం. కరోనా సమయంలో కూడా పండించిన ప్రతి పంట కొన్నం అని అన్నారు.

లక్షా 31 వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇచ్చినం, మీ అందరికి అనుభవంలో ఉన్నది అని అన్నారు. పోలిస్ డిపార్ట్మెంట్లో 8 నోటిఫికేషన్ల ద్వారా 32 వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్లో 24 వేల మందిని పెర్మనెంట్ చేసుకున్నాం, 9 వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం.. అందుకే 24 గంటల కరెంట్ వస్తుంది అని పల్లా వివరించారు. లక్షా 31 వేల ఉద్యోగాలకి పక్కా లెక్కలు చెప్పి, ఇంకో 60-70 వేల ఉద్యోగాలు ఒస్తాయి అని చెప్తే వాళ్ళకి మింగుడు పడట్లే అని అన్నారు. లెక్కలు తెలిసి కూడా కావాలని తికమక చేసేవాళ్లకు మాత్రం ముహ్ తోడ్ సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. మేం సంస్థల్ని రక్షించినం, నువ్వు మూసేసినవ్,..బీహెచ్ఈఎల్ ని, ఆర్టీసీని, సింగరేణిని రక్షించుకున్నాం… ఇవ్వాళ అవి నడుస్తున్నాయి అని అన్నారు.

3,24,000 మందికి 100% నుండి 300% శాతం జీతాలు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకా చేస్కోవాల్సినవి చాలా ఉన్నాయి, ఉద్యోగాలు ఇచ్చుకోవాలి, పీఆర్సీ ఇచ్చుకోవాలి, జీతభత్యాలు పెంచుకోవాలి… ఈ సంవత్సరం కష్టంగా ఉంది,కానీ ఖచ్చితంగా ఇచ్చితీరుతం.. ఇచ్చింది టీఆర్ఎస్సే, కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. కరోనా వల్ల 52 వేల కోట్లు నష్టం వచ్చింది, మ్యానిఫెస్టోలో చెప్పని అనేక అంశాలే చేసినం, చెప్పినవి చేయమా అని అన్నారు. ఏనాడు కూడా కౌన్సిల్లో ఆబ్సెంట్ కాలే, మాట్లాడకుండా లేను.. 6 సంవత్సరాల కాలంలో నా దగ్గరికి వచ్చిన అనేక సమస్యల్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేసిన, మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, సీఎం దగ్గరికి తీసుకపోయినా అని అన్నారు. ప్రశ్నను ప్రశ్నలా కాకుండా, పరిష్కరించే గొంతుగా ఉంటా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

- Advertisement -