గిరిజన వర్సిటీ ఏర్పాటు ఏది?: కవిత

79
- Advertisement -

గిరిజన బిడ్డల కష్టం చూసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, అందుకే ములుగును జిల్లాగా చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిందని చెప్పారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.137 కోట్లతో ప్రభుత్వం కరకట్టలను నిర్మించిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. రామప్ప పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -