అన్నదాతలందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కవిత

46

మానవాళికి అన్నం పెట్టేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంట్ లాంటి అనేక పథకాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్, వ్యవసాయాన్ని పూర్తి లాభసాటిగా మార్చారని కవిత అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. రైతులకు ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడే పార్టీ టీఆర్ఎస్. వడ్లు కొనబోమంటూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎందాకైనా కొట్లాడేందుకు టీఆర్ఎస్ సిద్దంగా ఉంది. రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.