కీచక కామాంధుడి అరెస్టు.. మోసపోయిన అమ్మాయిలు..

40

ఈ కీచక కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబద్‌లోని దిల్‌సుఖనగర్‌లో చోటు చేసుకుంది. ఈ కామాంధుడి వలలో చాలా మంది అమ్మాయిలు మోసపోయారని తెలుస్తోంది. నకిలీ ఇంస్టాగ్రామ్ క్రియేట్ చేసి అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు ఈ మోసగాడు. ఈ క్రమంలో క్లోజ్ ఫ్రెండ్స్‌గా చాటింగ్ చేస్తాడు మీ ఫోటోలు పంపించమని రిక్వెస్ట్ చేస్తాడు.. అయితే అమ్మాయి అనుకోని ఫోటోలు పంపించిన బాధితురాలిని అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తాడు.

న్యూడ్ ఫోటోలు పంపించకపోతే వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు బంధువులకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తాను బెదిరింపులకు దిగుతాడు ఆ కీచకుడు. న్యూడ్ ఫోటోలు పంపించడంతో తన కోరిక తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వేదిస్తాడు. ఇలా ఎందరో అమ్మాయిలు ఈ కీచకుడి వలలో పడ్డారు. 15 రోజుల క్రితం ఒక అమ్మాయి ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి.. బుధవారం అర్ధరాత్రి దిల్ సుఖనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్, మల్టీమీడియా చదువుకుంటున్నాడు. పోలీసు విచారణలో చాలా మంది బాధితులు ఉన్నారని నిందితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కొంతమంది అమ్మాయిలు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.