సింగరేణి…తెలంగాణ సిరుల బంగారం: కవిత

39
kavitha

తెలంగాణకు సింగరేణి తలమానికంగా నిలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి కాలరీస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కవిత… పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు.

తెలంగాణ మకుటం.. నల్ల బంగారం.. సిరుల సింగారం.. మన సింగరేణి…పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతూ, తెలంగాణకే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు.