రాష్ట్రంలో 24 గంటల్లో 635 కరోనా కేసులు…

29
coronavirus

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 84 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982కు చేరుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 6627 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 1522 మంది మృతి చెందగా కరోనా మహమ్మారి నుండి 2,74,833 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.5 శాతంగా ఉంటే… రాష్ట్రంలో 0.53 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 65,66,602కు చేరినట్టు పేర్కొంది ప్రభుత్వం.