ఎమ్మెల్సీ కవిత పోరాటం.. సక్సెస్?

41
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొన్నాళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూ వచ్చారు. మొదట్లో ఆమె పోరాటంపై ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు తెలుపలేదు. మరోవైపు కవిత పోరాటాన్ని పక్కత్రోవ పట్టించేందుకు ఆమెపై అక్రమ కేసులను బనాయించే ప్రయత్నం కూడా చేస్తోంది మోడి సర్కార్. అయినప్పటికి కవిత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తూనే వస్తున్నారు. బిల్లు ప్రతిపాదన కోసం గతంలో డిల్లీలోనూ పోరాటం సాగించారు కవిత. ఇక సిడబ్ల్యుసి సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీని కూడా ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఎందుకు ప్రశ్నించడం లేదని గట్టిగా నిలదీశారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ను ప్రస్తావించాలని 47 రాజకీయ పార్టీలకు కూడా లేఖ రాశారామె..

మొత్తానికి ఎమ్మెల్సీ కవిత ఉక్కు సంకల్పంతో అన్నీ పార్టీల్లోనూ చలనం తీసుకురాగలిగింది. ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రస్తావించాలని అన్నీ పార్టీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళ బిల్లును ప్రవేశ పెట్టేనేదుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి 2010 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాల్సిఉంది. కానీ అప్పుడు రాజ్యసభ బిల్లును ఆమోదించినప్పటికి లోక్ సభలో మాత్రం ఆమోదం లభించలేదు. ఇక అప్పటి నుంచి బిల్లు ప్రస్తావనే మరుగున పడిపోయింది. మరుగున పడిన ఈ బిల్లును తన ఉక్కు సంకల్పాంతో ఎమ్మెల్సీ కవితా అందరి దృష్టికి తీసుకొచ్చి.. ఆమోదం లభించేలా పోరాటం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడితే ఖచ్చితంగా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. మొత్తానికి కవిత పోరాటపటిమకు కేంద్రం కూడా తలొగ్గి బిల్లు ప్రవేశ పెట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

Also Read:పవన్ డైరెక్షన్ లో టీడీపీ ?

- Advertisement -