రజనీకాంత్ కి కూడా ప్యాకేజీ ఇచ్చాడా?

38
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ కి – టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?, ఎందుకు రజనీ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నాడు?, ఇదే ప్రశ్న చాలా రోజుల నుంచి చాలామందిలో మెదులుతుంది.. దీనికితోడు, జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో రజనీకాంత్‌ ములాఖత్‌ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చాయి. ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క‌ల‌వ‌నున్నార‌ని ప్ర‌చారం రావడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు రజనీకాంత్‌ కూడా మొన్న ఈ విషయం పై కామెంట్స్ చేశాడు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్‌ వల్ల వెళ్లలేకపోయానని రజనీ తెలిపారు. కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరే క్రమంలో విమానాశ్రయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

Also Read:ఎజెండా లేని సమావేశాలెందుకు ?

మొత్తమ్మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీకాంత్ కి – చంద్రబాబుకి ఏదో ఒప్పందం కుదిరింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ ఇచ్చినట్టే.. రజనీకాంత్ కి కూడా చంద్రబాబు పెద్ద ప్యాకేజీ ఇచ్చి ఉంటాడు అని.. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చంద్ర భజన్ చేస్తున్నాడు అని వైసిపి వాళ్ళు మేసేజ్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా సపోర్ట్ చేసిన వారందరికీ చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చుకుంటూ పోతే.. ఎప్పుడో అరెస్ట్ కావాల్సి వచ్చేది. అయినా, రజనీకాంత్ ప్యాకేజీలకు అమ్ముడుపోయే మనిషి కాదు అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read:పవన్ డైరెక్షన్ లో టీడీపీ ?

- Advertisement -