సురభి వాణి దేవికి శుభాకాంక్షల వెల్లవ..

249
mlc kavitha
- Advertisement -

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణి దేవికి పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వాణీదేవికి తమ అభినందనలు తెలిపారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందించిన పట్టభద్రులందరకీ, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు.

రాష్ట్రంలో గత ఆదివారం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో ఎస్‌ వాణీదేవి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది.

దాదాపు నాలుగురోజుపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ గులాబీ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శించారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్‌కు కేవలం 21 రోజులముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వాణీదేవి అతికొద్ది సమయంలోనే సిట్టింగ్‌ అభ్యర్థి, బీజేపీకి చెందిన రాంచందర్‌రావును మట్టి కరిపించారు.

- Advertisement -