- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న రాఘవ సంఘటన జరిగినప్పటి నుండి తప్పించుకుని తిరుగుతున్నారు.
విశాఖలో రెండురోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాద్రావ్ ఆధ్వర్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నివర్గాల నుండి వ్యతిరేకత రావడంతో పార్టీ నుండి రాఘవను సస్పెండ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాఘవ గాలింపు కోసం వాహనాల డీజిల్ ఖర్చు, భోజనాలకు కలుపుకొని రోజుకు సుమారు రూ.లక్ష ఖర్చు చేసినట్లు పోలీసు అధికారుల్లో ఒకరు తెలిపారు. ఎట్టకేలకు అతడు పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -