రాఘవను పోలీసులకు నేనే అప్పగిస్త: ఎమ్మెల్యే వనమా

19
vanama

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ బాగోతం ప్రకంపనలు సృష్టిస్తున్నది. అతడి వేధింపులు భరించలేకే సూసైడ్​ చేసుకుంటున్నట్లు రామకృష్ణ అనే వ్యక్తి  లెటర్​ రాసి ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మాహుతికి పాల్పడటం సంచలనంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే కొడుకు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా నాలుగు రోజులుగా టీఆర్​ఎస్ హైకమాండ్​ సైలెంట్​గా ఉండటం విమర్శలకు దారితీస్తున్నది. ఇదే క్రమంలో మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో ఒకటి గురువారం బయటకు వచ్చింది. తన భార్యను పంపాలని రాఘవ అడిగినందుకే కలత చెంది సూసైడ్​ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు.

తన కొడుకును  పోలీసులకు అప్పగించేందుకు రెడీగా ఉన్నానని, కేసు విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేందుకు సహకరిస్తానని పేర్కొన్నారు. తన కొడుకు రాఘవ నిర్దోషిగా తేలేంత వరకు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. సోషల్​ మీడియాలో తిరుగుతున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో తనను ఎంతో మానసిక క్షోభకు గురి చేసిందన్నారు.