317 జీవోను సవరించాలి: రఘునందన్ రావు

18
raghunandan rao

317 జీవోను ఉద్యోగుల సవరించాలని అడుగుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో హార్ట్ ఎటాక్ తో చనిపోయిన రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ మురళీధర్ రావును ఆయన స్వస్థలం నర్సింగబట్ల లో నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్ రావు..317 జీఓ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు గుండె ఆగి చనిపోతున్నారని చెప్పారు. 317 జీఓ వల్ల చనిపోయిన చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగం తోపాటు 50 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వము తరుపున సానుభూతి కూడా తెలియజేయడం లేదన్నారు. మురళీధర్ రావు కుటుంబానికి NSR ఫౌండేషన్ తరుపున 25 వేలు చెక్కును అందిస్తున్నాం అని చెప్పారు.