ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో, సీసీ కెమెరాల కోసం డీజీపీకి ఏడూ కోట్ల రూపాయల నిధుల కేటాయింపు పత్రం మరియు సామాజిక సేవ సంస్థ సభ్యుల ద్వారా 500 సీసీ కెమెరాలు రెండు రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని ఎల్‌బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఎల్‌బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 2021-2022వ సంవత్సరం బడ్జెట్‌కు గాను తన శాసనసభ్యుల నిధులు మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు, అలాగే ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం,దయనంద్ గుప్తాలు తల ఒక కోటి రూపాయలు,మొత్తం కలిసి ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీ ప్రతినిధులు మరియు సమజాసేవ సభ్యులు పాల్గొని తమవంతు సాయంగా దాదాపు 500 సీసీ కెమెరాల కోసం నిధులు ఇస్తాము అని హమీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవాత్ లకు రెండు రోజుల్లో మంజూరు పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక్క ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూడా కోటి రూపాయల నిధులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక.. పోలీస్ వ్యవస్థ మరింత మెరుగుపడింది అని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్,షి టీమ్స్,భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాల గురించి కూడా ప్రజల్లో అవగహన కల్పించడం జరిగింది అని తెలిపారు. తప్పు చేయాలంటే దొంగలు బయపడే రోజులు వచ్చాయి అని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణ అనుమతుల్లో పనుల్లో సీసీ కెమెరాలు కూడా అమార్చుకోవలని నిబంధనలు తీసుకురావాలని డీజీపీ సూచించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు మనకు ఒక సంస్కారం నేర్పిస్తుంది అని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు బిగించిన అనంతరం నేరాలు (దొంగతనం,చైన్ స్నాచింగ్స్,దోపిడీలు) లాంటివి పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు అని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని తెలిపారు. రాబోయే రెండు,మూడు సంవత్సరాల కాలంలో ఎల్బి నగర్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అన్ని కాలనీలలో 100% సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు.
తద్వారా నేరాలు అదుపులోకి వస్తాయి. ఒకవేళ నేరం జరిగితే కూడా అట్టి నేరం చేసిన వారిని గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకోవడం జరుగుతుంది అని తెలిపారు. 2023-2024 వరకు అన్ని కాలనీలలో విడతల వారిగా సీసీ కెమెరాల ఎర్పాటే మా లక్ష్యం అని తెలిపారు.మొత్తం కలిసి దాని విలువ 10 కోట్ల రూపాయల వరకు అంచనా అవుతుంది అని తెలిపారు.ఎల్బి నగర్ నియోజకవర్గం భద్రత దృష్ట్యా అన్ని రంగాల్లో ముందు ఉంటుంది అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు,ఎల్బి నగర్ డిసిపీ సన్ ప్రీత్ సింగ్,ఏసీపీలు శ్రీధర్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి మరియు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఎల్బి నగర్,సరూర్ నగర్,చైతన్య పూరి,వనస్థలిపురం,మీర్ పేట ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు పాల్గొన్నారు.