రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ హరితహారం కి మద్దతుగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు బానోత్ శంకర్ నాయక్. ఒకప్పుడు శుభకార్యం అంటే కొబ్బరి కాయ కొట్టడం ఆనవాయితీ ఉండే , ఇప్పుడు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ప్రారంభించాక మొక్కలు నాటడం ఆనవాయితీ గా మారింది అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ శాసన సభ్యులు గౌరవ శ్రీ బానోత్శం కరన్న గారి ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ భవనాన్ని సందర్శించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి తదనంతరం మల్యాల గ్రామంలో రైతు సమితి భవన నిర్మానానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతుల అభివృద్ధికి అను నిత్యం పాటుపడుతున్నారని,ఇంకా అనేక కార్యక్రమాలు మున్ముందు చేపడతారని రైతులు పండించిన పంటలను రైతు సమితి కోనుగోలు చేస్తుందని అన్నారు. కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం లో అందరు భాగస్వామ్యులు కావలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి,వైస్ చైర్మన్ ఫరీద్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీరవేళ్ళి భరత్ కుమార్ రెడ్డి,మార్నేని వెంకన్న,కేఎస్ఎన్ రెడ్డి,యాళ్ళ మురళిదర్ రెడ్డి,జనార్దన్,సుధాగాని మరళి,అశోక్,తేళ్ళ శ్రీనివాస్,పాషా,రఘు,రంజిత్,గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు…! ఈ సందర్బంగా శంకర్ నాయక్ గారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో ముగ్గురికి బాలాజీ నాయక్ గారు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్
KSN రెడ్డి జిల్లా నాయకులు , జెడ్పిటిసి శ్రీనివాస్ గార్లు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెల్సిందిగా కోరారు .