దుబ్బాక ప్రజలు రఘునందన్‌కు బుద్ధి చెబుతారు..

407
Padma Devender Reddy
- Advertisement -

బిజెపి రఘునందన్ రావు ఐడ్రామ, నటనతో అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నీలకంఠ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ మాట్లాడుతూ.. భర్తను పోగుట్టుకున్న సుజాతక్క ఏడుపును ఎక్కిరించే రఘునందన్ రావుకు తగునా. నిన్న జరిగిన ఐడ్రామలో బిజెపి వారు తేలు కుట్టిన దొంగలు అన్నారు. డికె అరుణకు దుబ్బాక గురించి ఏమి తెలుసని మాట్లాడుతుంది? దుబ్బాక ఉద్యమాల గడ్డ.. టిఆర్ఎస్‌కు అడ్డ అన్నారు. ఎన్ని డ్రామాలాడిన 3వ తారీఖున దుబ్బాక ప్రజలు రఘునందన్ కు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే పద్మ తెలిపారు.

రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. ఇంట్లో డబ్బులు అడ్డంగా దొరికితే మా డబ్బులు కావనడం సిగ్గుచేటు. కన్నీళ్లను కూడా ఎన్నికలకు వాడుకునే పరిస్థితి బిజెపికి దాపురించిందన్నారు. డిపాజిట్ రాదనే విషయం తెలిసి ఏదో ఒక రకంగా బట్టకాల్చి మీదేస్తున్నది బిజెపి. బండి సంజయ్ కరీంనగర్‌లో ఉండి దుబ్బాకలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండు. అవన్నీ దుబ్బాక ప్రజలు తిప్పి కొడతారని ఎమ్మెల్యే రసమయి పేర్కొన్నారు.

- Advertisement -