బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్‌..

246
talasani
- Advertisement -

బీజేపీ తీరును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాదని, ఆ పార్టీ నాయకులు చేసే గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి అన్నారు. నిన్న దుబ్బాక, సిద్దిపేటలో జరిగిన సంఘన అంతా చూశాం. దీనికి మా ప్రభుత్వం పాలనలో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో వరదలతో ప్రజలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి సహాయం అందలేదు. అంతేకాదు జీఎస్టీ నిధులే ఇంకా రాలేదు. బీజేపీ నేతల మాటలు ఏకవచనంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు. దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు. ఇది బలుపు కాకపోతే మరెంటి? బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు.

సిద్దిపేటలో నిన్న పోలీసులు సెర్చ్ చేసి డబ్బులు తీశారు. డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారు. 5 లక్షలు అపహరణకు గురైంది.. అది పెద్ద క్రైమ్..ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు. కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసు కోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు.దుబ్బాకలో మాకు మెజారిటీ కచ్చితంగా వస్తుంది..ప్రజలే మాకు బాసులు..మేము చేసిన అబివృద్ది సంక్షేమ ఫలాలు మాకు గెలుపుని ఇస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా సోదాలు జరగడం సర్వ సాధారణం. హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. మీడియాలో ప్రచారం కోసమే బీజేపీ హడావుడి చేసిందన్నారు మంత్రి తలసాని.

- Advertisement -