కేసీఆర్,కేటీఆర్‌కు కృతజ్ఞతలు- ముఠా గోపాల్

502
kcr ktr

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఇవాళ ప్రారంభమైంది. కారిడార్‌ 2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం మెట్రోలో ప్రయాణించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సీఎం కేసీఆర్‌కు చిక్కడపల్లి మెట్రో స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరైయ్యారు.

cm kcr

ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ ప్రజానీకం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్‌లో మూడు స్టేషన్లలో ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెట్రో స్టాప్స్ పెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మెట్రో ద్వారా ప్రజా రవాణా సౌకర్యవంతంగా చేసినందుకు సీఎం కేసీఆర్ కు,మంత్రి కేటీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు.

ఇక ఈ రోజు ప్రారంభమైన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రూట్‌లో 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్ మీదుగా రైలు ఎంజీబీఎస్ చేరుకోనుంది.

Musheerabad MLA