రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందని రైతులు ఎవ్వరు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్, మంతటి గ్రామంలోని కొనుగోలు కేంద్రంతో పాటు పలు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రైతులతో,అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అకాల వర్షానికి ధాన్యం తడవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పలు రైస్‌మిల్లు లను పరిశీలించి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యం సేకరణలో వేగం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు.రైతులు సంయమనంతో పద్ధతి ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.