మ‌త విద్వేషాలను రెచ్చ‌గొట్ట‌డ‌మే బీజేపీ ప‌ని..

487
MLA Guvvala Balaraju
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బండి సంజ‌య్ పిచ్చి కుక్క‌లా అరుస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. 2048 వ‌ర‌కు కూడా బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రాదు అని స్ప‌ష్టం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామ‌ని దేశ ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాని మోదీ మోసం చేశారు. కులం, మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డ‌మే బీజేపీ నేత‌ల ప‌ని అని మండిప‌డ్డారు.

మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌ని బీజేపీ నేత‌లు.. వారి గురించి మాట్లాడేందుకు సిగ్గుండాల‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదు అని అన్నారు. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఉద్ఘాటించారు. బీజేపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేత‌లు ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌ని తెలిపారు. లెక్కాప‌త్రం లేకుండా బీజేపీ నేత‌లు అవినీతి గురించి మాట్లాడటం స‌రికాద‌ని గువ్వ‌ల బాల‌రాజు మండిపడ్డారు.

- Advertisement -