రేణు దేశాయ్‌కి క‌రోనా.. స్పందించిన నటి..

32
Renu Desai

ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తాజాగా త‌నకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన‌ట్టు న‌కిలీ వార్త‌లు పుట్టించారు. రేణూ పేరుతో త‌ప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ..క‌రోనా సోక‌డంతో నేను కొన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యా. షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చాను అని రేణూ పేర్కొన్నట్టు పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైర‌ల్ కావ‌డంతో ప‌లు వెబ్ సైట్స్ ఈ వార్త‌ల‌ని ప్ర‌చురించాయి. దీంతో ఈ విషయంపై స్పందించిన రేణూ దేశాయ్‌ తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కరోనా రిపోర్టును కూడా షేర్‌ చేశారు.

నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను” అని తేల్చి చెప్పారు. తనకు కరోనా అంటూ తప్పుడు వార్తలను రాసినవారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెల‌బ్రిటీల‌కు వెరిఫైడ్ అకౌంట్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వండి అని రేణూ సూచించారు. త‌న సోష‌ల్ మీడియాలో సదరు వెబ్ సైట్, వారి ట్విట్టర్ హ్యాండిల్‌ స్క్రీన్ షాట్లను షేర్ చేసింది.