ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కుటుంబంలో విషాదం..

1286
- Advertisement -

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం తెల్లవారు జామున రేకుర్తిలో వాకింగ్‌కు వెళ్లిన గంగుల ప్రభాకర్‌ వాకింగ్‌ సమయంలోనే రేకుర్తి వంతెన వద్ద గుండెపోటు రావడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.

MLA Gangula Kamalakar brother dies with Stroke while Joggi.

మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన తమ్ముడు ప్రభాకర్‌ హఠాన్మరణం చెందడంతో ఎమ్మెల్యే కమలాకర్‌ తీవ్రంగా కలత చెందారు. గంగుల ప్రభాకర్‌ మరణవార్త తెలుసుకుని వారి బంధువులు స్నేహితులు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు ప్రభాకర్‌ మరణించాడన్న వార్త తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కమలాకర్‌ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

- Advertisement -