కరీంనగర్ సీటు.. కాంగ్రెస్,బీజేపీలో తలపోటు!

61
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సీట్ల కోసం జరుగుతున్నా రగడ అంతా ఇంతా కాదు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేస్ లో ఎవరికి అందనంత వేగంగా దూసుకుపోతుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో మాత్రం సీట్ల పంపకాల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని నియోజిక వర్గాలలో అభ్యర్థులను ఎన్నుకోవడం ఈ రెండు పార్టీలకు తలప్రాణం తోకకి వచ్చేలా ఉంది. కరీంనగర్ అసెంబ్లీ బరిలో బి‌ఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్ రెడ్డే మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ లు మాత్రం ఈ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాయి.

ఈ నియోజిక వర్గం జనరల్ సీటు కావడంతో పెద్ద ఎత్తున రెండు పార్టీలకు దరఖాస్తులు వచ్చి చేరాయి. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచేందుకు దాదాపుగా 15 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఈ టికెట్ కోసం 21 దరఖాస్తులు వచ్చాయట. కాంగ్రెస్ తరుపుగా గత ఎన్నికల్లో కరీంనగర్ నియోజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. కానీ ఈసారి ఆయన హుస్నాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. దాంతో హస్తం పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

Also Read:MP Santhosh Kumar:రన్‌ ఫర్ పీస్

కొత్త జయపాల్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి ఎన్ సత్యనారాయణరావు మనవడు రోహిత్ రావు, కర్ర సత్యా ప్రసన్నరెడ్డి.. ఇలా చాలా మంది హస్తం పార్టీ నుంచి టికెట్ కోసం పోటీలో ఉన్నారు. అటు బీజేపీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికి గత ఎన్నికల్లో ఓటమి కారణంగా విముఖత చూపిస్తున్నాట్లు తెలుస్తోంది. దాంతో బండి సంజయ్ పోటీ చేయకపోతే తమకు కేటాయించాలని బస సత్యనారాయణ, మాజీ మేయర్ డి శంకర్ వంటివారితో పాటు 21 మంది టికెట్ ఆశిస్తున్నారట. అసలే ఈ రెండు పార్టీలకు బలం లేని చొట జనరల్ టికెట్ కావడంతో అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్, బీజేపీలకు తీవ్ర తలనొప్పిగా మారింది.

Also Read:మైనంపల్లి ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు బిగ్ షాక్?

- Advertisement -