- Advertisement -
రాజసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రీన్ చల్లేంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి జనాభా దాటిన మహానగరంలో ఎన్ని మొక్కలు నాటిన తక్కువ అని… నగరాన్ని గ్రీన్ నగరంగా చెయ్యడానికి గ్రీన్ చల్లేంజ్ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అని అన్నారు.
నగరం పచ్చగా ఉంటే, ప్రజలు క్షేమంగా ఉంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే పచ్చని చెట్లు పెంచడం ముఖ్యం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా నియోజకవర్గ కార్యకర్తలను, అభిమానులు పిలుపునిస్తున్నా అన్నారు.
- Advertisement -