గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ఎమ్మెల్యే నన్నపనేని

50
gic

పీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతూ…గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలునాటాల్సిందిగా కోరారు.

దీంతో ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ వరంగల్ టీఆరఎస్ పార్టీ కార్యాలయం లో మూడు మొక్కలు నాటారు . ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మదినం రోజు మొక్క నాటి నలుగురికి నీడనిచ్చే మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో తృప్తి ఉందని , పర్యావరణ పరిరక్షణ కోసం , కాలుష్య నివారణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారు తీసుకుంటున్న చొరవ చాలా గొప్పదన్నారు.

10కోట్ల మొక్కలు నాటే లక్ష్యం లో ఇప్పటికే 5 కోట్ల మొక్కలు నాటారని , మిగిలిన మొక్కలను సాధ్యమైనంత తొందరలో నాటేవిదంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అని తెలిపారు . ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.