- Advertisement -
చెన్నూర్ నుంచి మందమర్రికి నూతన రహదారి వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఈ మార్గం ద్వారా దాదాపు 40-50 కిలో మీటర్ల దూరం తగ్గనుందని తెలిపారు.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. మా విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో జరిగే అన్ని రాష్ట్రాల రహదారుల సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామిఇచ్చారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలం కలిసి కేంద్రంతో ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతామన్నారు ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బండ ప్రకాశ్.
- Advertisement -