కరోనా నియంత్రణపై ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష..

550
mla balka suman
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కరోనా నివారణపై తీసుకుంటున్న జాగ్రత్తల దృష్ట్యా క్యాతనపల్లి మున్సిపాలిటి పరిధిలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసే వాహనాన్ని మరియు కూరగాయల మార్కెట్,నర్సరీలను సందర్శించడం జరిగింది. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటి పరిధిలో కరోనా మహామ్మారి ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,బెల్లంపల్లి డీఎస్‌పీ ఎం.ఎ రహమాన్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ్, మందమర్రి సీఐ ఎడ్ల మహేష్ ,రామకృష్ణాపుర్ ఎస్ఐ రవిప్రసాద్ పాల్గొనడం జరిగింది.

అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను చెన్నూర్ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనా గిల్డా-రాంలాల్, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, జడ్.పి.టి.సి తిరుపతి, యం.పి.పి మంత్రి బాపు, కౌన్సిలర్ లు, జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ బాపు,సీఐ ప్రమోద్ రావు,ఎంఆర్‌ఓ రాంచందర్,చెన్నూర్ ఎస్‌ఐ సంజీవ్ పాల్గొనడం జరిగింది.

 

- Advertisement -