తెలంగాణ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు..

274
IT Minister ktr

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి ఈ రోజు కూడా భారీగా విరాళాలు అందాయి. ఈరోజు విరాళాలు ప్రకటించిన పలువురు మంత్రి కే తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిసి వాటికి సంబంధించిన చెక్కులను అందించారు. ఈ రోజు సుమారు 9 కోట్ల రూపాయల విరాళాలు ముఖ్యమంత్రి సహాయనిధి కి అందాయి.

ఈ రోజు అందిన విరాళాల వివరాలు..

• రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున రిలయన్స్ జియో సి ఈఓ కే సి రెడ్డి మరియు రిలయన్స్ ప్రతినిధి కమల్ పొట్లపల్లి ఐదు కోట్ల రూపాయల చెక్కును మంత్రి కే తారకరామారావుకి ఈరోజు అందించారు.

• దీంతోపాటు అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్ హాస్టల్స్ అసోసియేషన్ మరియు ఇతర వెల్ఫేర్ అసోసియేషన్లకు చెందిన 161 మంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 45 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు.

•  ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు 42 లక్షల రూపాయల విరాళం అందించారు.

•  ఎమ్మెల్యే కాలే యాదయ్య నేతృత్వంలో సుమారు 18 మంది చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు 30 లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలను అందించారు.

• సుమధుర ఇన్ఫ్రా 25 లక్షలు, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి మరో 25 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు.

• వర్క్స్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వాసవి రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షల చొప్పున అందించారు.

• దీపీక్షిత మహిళా క్లబ్ తరఫున 21 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కు అందించారు.

• విరుపాక్షి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ 15 లక్షలు.

•  వెర్మాంట్ డెవలపర్స్ తరఫున 11 లక్షల రూపాయల చెక్కు కేటీఆర్ కు అందించారు.

• శ్రీకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆ సంస్థ సీఎండీ శ్రీనివాసరావు పది లక్షల రూపాయల విరాళాన్ని, అందుకు సంబంధించిన చెక్కుని మంత్రి కేటీఆర్ అందించారు.

• తెలంగాణ రికగ్నైస్ డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కి సీఎంఆర్ఎఫ్ కోసం అందించారు.

• క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్, నక్షత్ర ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్మయ సేవ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ తదితరులు 10 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ కు చెక్కులను అందించారు.

• మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 10 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కి ఈ రోజు ప్రగతిభవన్లో అందించారు.