ముఖేశ్ అంబానీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు..

357
ktr minister

‘కరోనా’ కట్టడికి పోరాడుతున్న ప్రభుత్వానికి తమ వంతుగా పలువురు ప్రముఖలు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ. 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్‌కు రిలయన్స్‌ జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ఆర్‌ఐఎల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల అధికారి కమల్‌ పొట్లపల్లి అందజేశారు.

ఈ సందర్భంగా రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీకి మంత్రి కేటీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేటీఆర్ ఓ పోస్ట్ చేశారు. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తాము చేస్తున్న పోరాటానికి ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.