టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే గిరిజన సంప్రదాయాలు, పండగలు, జాతరలకు ప్రాధాన్యత లభించిందని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. మంచిర్యాల జిల్లా గిరిజన, మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖల అధిరాకులతో సత్యవతి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి….గతంలో ఏ పాలకులు కూడా గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. జాతరలను అధికారికంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు 50 గ్రాముల కంటే తక్కువ ఉండొద్దనే నిబంధన విధించామని చెప్పారు.
అంగన్‌వాడీలకు వచ్చే పాలను విజయ డైరీ నుంచి తీసుకుంటున్నామని …..ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా జరుగుతుందని చెప్పారు. పిల్లల్లో పోషకాహార లోపం ఉందని ఒక సర్వేలో తేలిందని, దీనిని అధిగమించడానికి నివారించాలని ఆదేశించారు. త్వరలో పిల్లలకు కూడా పాలు, మిల్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్, చిక్కీలు ఇచ్చే ఆలోచన కూడా ఉందన్నారు.