గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న తేజాస్ ఐఏఎస్..

168
Tejas IAS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్ తేజాస్ ఐ ఏ ఎస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన ఒకేరోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటి సీఎం కెసిఆర్‌కు బహుమతిగా అందించారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు మరుపురాని కానుకగా అందించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని తేజాస్ ఐ ఏ ఎస్ పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని మరో ముగ్గురికి హేమంత్, ఆదర్శ్, కిరణ్, మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్‌లకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -