బైక్‌పై ఇద్దరికీ హెల్మెట్ కంపల్సరీ..

186
Helmet
- Advertisement -

కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. టూవీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే మొదటిసారి మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పోలీసులకు చిక్కితే డ్రైవింగ్ లైసెన్స్ ను జీవితకాలం రద్దు చేయనున్నారు. డ్రైవింగ్ చేస్తున్నవారితో పాటుగా వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ , రాష్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ జంపింగ్ చేయడం వంటి వాటివల్ల చాలావరకు ప్రాణాలు పోతున్నాయని అందుకే కొత్త చట్టాన్ని కఠినంగా అమలుచేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

- Advertisement -