కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఆరవ విడత హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లడుతూ…. దేశం ఎ రాజకీయ నాయకుడు చేయని విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. గత 5సంవత్సరాలుగా హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయంలో అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటే వారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుతంలోని అన్ని శాఖలు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. కేవలం కామారెడ్డి ఒక్క జిల్లాకే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ను కలుపుకుని మొదటి సంవత్సరం 80 కోట్లు, రెండవ సంవత్సరం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నారు.రాజకీయాలకు అతీతంగా హరిత హారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కొరారు.