ఈనెల 18నుంచి 25వరకూ నట్టల నివారణ మందుల పంపిణిః మంత్రి తలసాని

391
Talasani-Srinivas-Yadav
- Advertisement -

రాష్ట్రంలోని పశువైద్యాధికారులతో సెక్రటేరియట్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 18 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు మొదటి విడత నట్టల నివారణ మందుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరిని భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. .

రాష్ట్రంలోని 3కోట్ల 25లక్షల గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల మందు వేయడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి మూడు విడతలుగా ఈ కార్యక్రమం చేపడుతామని చెప్పారు.ఇందుకోసం 22కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని. నట్టల నివారణ కార్యక్రమంలో ప్యారా వెట్, గోపాల మిత్రల సేవలను వినియోగించుకొని పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు.

జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోపాల మిత్రలకు నెలకు 8500 రూపాయల వేతనం చెల్లిస్తుందని చెప్పారు.

- Advertisement -