ఎస్పీ బాలు మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం..

166
talasani
- Advertisement -

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడి గాన గంధర్వుడిగా అనేక మంది అభిమానులను పొందారు. 100కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. పాటల దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి తలసాని అన్నారు.

గాయకుడిగా, నటుడిగా చలనచిత్ర రంగానికి అనేక సేవలు ఆనందించారు. బాలు మృతితో చలనచిత్ర రంగం ఒక ప్రఖ్యాత గాయకుడిని కోల్పోయింది. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

- Advertisement -