బాలు లేని లోటు ఎన్నటికీ తీరనిది: శ్రీనివాస్ గౌడ్‌

170
sp balu

గాన గాంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు సంగీత ప్రియులందరికి అభిమానులయ్యారన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పుడ్చలేనిదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.