సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. My Name Is శృతి..సినిమా ప్రీ రిలీజ్‌లో మాట్లాడిన తలసాని..అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం, ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం అని వెల్లడించారు.
ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని చెప్పారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు.
సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే అన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందన్నారు.హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు…తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదన్నారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది…తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు.