ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం..బీజేపీకి తలసాని సవాల్

14
talasani

బీజేపీకి సవాల్ విసిరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని సవాల్ విసిరారు.

అమిత్ షా తన హూందాను మరిచి సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. గుజరాత్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదనే వారు తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని అన్నారు.

మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అని అమిత్ షా అన్నారని, మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు.