స్థిరంగా పెట్రోల్,డీజిల్ ధరలు

49
petrol

దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. హైదరాబాద్‌లో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్ద ఉండగా.. డీజిల్ రేటు రూ. 94.62 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోనూ పెట్రోల్ ధర ఇదే దారిలో నడుస్తోంది. రేటులో ఎలాంటి మార్పు కనిపించట్లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. ఈరోజు ఢిల్లీలోని పెట్రోల్ పంప్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 95.41గా ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ.86.67గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బీహార్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో పెట్రోలు ఇప్పటికీ రూ.100 పైనే ఉంటున్నాయి.