గొల్ల,కుర్మలకు ఉపయోగపడే విధంగా త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తీనాం చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని……గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులకు చేయూత నివ్వడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నరు సీఎం కేసీఆర్ అని తెలిపారు.రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం..కరోనా కాలంలో కోటి రెండు లక్షల ఎకరాల పంట రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.
గొల్ల కుర్మలకు, మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా త్వరలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ను నెలకొల్పుతం…యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచ స్థాయి దివ్య క్షేత్రం గా అభివృద్ధి చేస్తున్నారు సీఎం కేసీఆర్….ఎనిమాల్ హెల్త్ కార్డు విధానం కూడా త్వరలోనే ప్రవేశపెడతాం …కరోనా సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు తలసాని.