మొక్కలు నాటిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి…

259
kancherla bhupal reddy

నలగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి నల్లగొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో మరియు మండల కేంద్రాల్లో వివిధ గ్రామాలలో మొక్కలు నాటిన ప్రజలకు , అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కంచర్ల ధన్యవాదాలు తెలియజేశారు.

అదేవిధంగా ఈరోజు రాజ్య సభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ శ్రీ.జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ వేదికగా నాకు జన్మదిన శుభాకంక్షాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు చేశారు. రాజ్య సభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నా పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు.

నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఈరోజు 5000 ల మొక్కలు నాటడం జరిగినది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచాలని కార్యాచరణ చేపట్టడం జరిగినది. మరియు నియోజకవర్గం లో ప్రతి ఒక్కరి చేత మొక్కలు నటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళతామని కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం చేయడం జరిగినది. ఇటువంటి మహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.