స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష

118
ktr

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన ఈ-యస్ యఫ్ సి డిజిటల్ ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేశారు మంత్రి కేటీఆర్. దీంతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, కార్పోరేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించిన మంత్రి ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు.

హైదరాబాద్ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతుంది..పరిశ్రమల శాఖ పైన ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పెట్టుబడులు తేస్తున్నామని, అయితే కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

ఈ మేరకు నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. దీంతోపాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి కూడా సమీక్షించిన మంత్రి, ఇలా కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు.దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చాలని ఇందుకోసం ఒక బ్లూ బుక్ ని తయారు చేయాలని సూచించారు. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారికి వివరాలు, పరిశ్రమల కేటగిరీలతో(సూక్ష్మ, యంయస్ యంఈ, ఇతర) పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ వర్గాల్లో ఉన్న సమ్మిళిత(inclusive) స్ఫూర్తి తెలుస్తుందన్నారు. ఇలాంటి సమాచారంతో ప్రభుత్వం వద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటు ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.